శిల్పారామంలో అల‌రించిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో పద్మకల్యాణ్ నేతృత్వంలో శంభు కింకిణి నృత్యోత్సవం నిర్వహించారు. అరుణ స్వరూప్ కూచిపూడి నృత్య ప్రదర్శనలో మండోదరి శబ్దం, ఎంతచక్కని వాడే, జావళి, డెబీజాని బసు కథక్ నృత్య ప్రదర్శనలో శివ స్తుతి, తీన్ తాల్, తుమ్రి, తులసి దాస్ భజన్, శ్రోబన మిత్ర దాస్ మణిపురి నృత్య ప్రదర్శనలో సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అండ్ వుమెన్ వుడ్, సాయి మనస్విని ఆంధ్రనాట్యం ప్రదర్శనతో కళాకారులందరూ ఎంతగానో అలరించారు. వీరందరికి డాక్టర్ రత్న శ్రీ అసోసియేటివ్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ, మధు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దూరదర్శన్, డాక్టర్ రుద్రవరం సుధాకర్ అసోసియేటివ్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ, రొయ్యురు శేషసాయి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబ‌ర్ ముఖ్య అతిధులుగా విచ్చేసి అభినందించారు.

నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రిస్తున్న క‌ళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here