సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కి చెందిన సాయి కార్తీక్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.1,00,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, ప్రసాద్, పోతుల రాజేందర్, సత్యనారాయణ, వెంకటేష్ యాదవ్, చాట్ల రవి, మహేందర్ రెడ్డి, కోట శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్‌వోసీ ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న పీఏసీ చైర్మ‌న్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here