చికిత్స అందిద్దాం.. ప్రాణదానం చేద్దాం..

  • చందానగర్‌ సర్కిల్‌ పారిశుద్ధ్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ
పారిశుద్ధ్య సిబ్బందికి సీపీఆర్‌ చేసే తీరును చూపిస్తున్న డాక్టర్ కార్తీక్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని పారిశుద్ద్య సిబ్బంది, ఇంజనీరింగ్‌ వర్క్​ ‍ఇన్ స్పెక్టర్లకు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్‌ కల్యాణ మంటపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్‌ టైనర్ సర్కిల్‌ వైద్యాధికారి డాక్టర్‌ కార్తీక్‌ సీపీఆర్‌పై అర్థమయ్యే రీతిలో వివరించారు. ఎవరైనా హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలితే బాధితుడిని వెల్లకిలా పడుకోబెట్టడటం, 108 కు ఫోన్‌ చేయటం, ప్రాథమిక చికిత్సను ఎలా ప్రారంభించాలో చెప్పారు. బాధితుడి గుండెపై కనీసం 30 సార్లు పంపింగ్‌ చేయటం, ముడుచుకుపోయిన మెడను నిటారుగా ఉండేలా ….శ్వాస ఆడేలా చేయాలని సూచించారు. మాదిరి బొమ్మపై ప్రాక్టికల్స్​‍ రూపంలో సిబ్బందికి డాక్టర్‌ కార్తీక్‌ వివరించారు. సీపీఆర్‌పై సిబ్బంది క్షుణ్ణమైన అభ్యసనను పొందాలని, తద్వారా గుండె వైఫల్యంతో అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా బల్దియా చీఫ్‌ మెడికల్‌ అధికారిణి డాక్టర్‌ పద్మజ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా పారిశుద్ధ్య సహా అన్ని విభాగాల సిబ్బంది సీపీఆర్‌పై శిక్షణను అందిస్తున్నట్లు, వారి ద్వారా బాధితులకు ప్రాథమిక చికిత్సతో ప్రాణాపాయం నుంచి కాపాడేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారిణి డాక్టర్‌ సృజన, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఈ ధీరజ్‌, ఎస్ఎస్ శ్రీనివాస్, ఆర్‌పీ మహేశ్‌ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here