శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో రూ.9 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న సీసీ రోడ్ల పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ శుక్రవారం పరిశీలించారు. అంజయ్యనగర్ శ్మశాన వాటికలో జేసీబీ సహాయంతో చెట్లను, మొక్కలను తీసివేసి నేలను చదును చేసే పనులను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం అంజయ్య నగర్, సిద్దిక్ నగర్ కాలనీలలో పర్యటించి స్థానిక ప్రజలను అడిగి ఆయన సమస్యలను తెలుసుకున్నారు. అందుకు స్పందించిన కార్పొరేటర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కొండాపూర్ డివిజన్ లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసిన వెంటనే సీసీ రోడ్ల పనులను వేగవంతంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. అలాగే ఎమ్యెల్యే గాంధీ సహకారంతో డివిజన్ లో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట వార్డు మెంబర్ నరసింహ సాగర్, తెరాస నాయకులు శ్రీదేవి, నందు, హినాయత్, అన్వర్, షాలీమ్, శారద, లక్ష్మి, యూత్ నాయకులు దీపక్, జుబేర్, నవీద్, శ్యామ్, కాలనీ వాసులు ఉన్నారు.