- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్
- కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎంపీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలే తమ బలమని, వారి వెంటే ఉంటానని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గ హఫీజ్ పెట్ డివిజన్ సుబాష్ నగర్ బస్తిలో బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి హమీద్, హనీఫ్, ఇస్మాయిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఇబ్రహీం, ఉస్మాన్, అదృష్ట, సూర్యప్రతాప్ రెడ్డి, ఆసన్న, రిజ్వాన్, హఫీజ్, ఫిరోజ్, అమీర్, రఫీ, తమీర్, జలీల్, కృష్ణ, వంటల కృష్ణ, ఇబు, స్వామి, దేవానంద్, మినాజ్, ఫైజాన్, నర్సింహ, ముత్యాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. ఎంపీ గెలుస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిటీకి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్, ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షురాలు రేణుక, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, గుంటూరు రాజు ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, కంది చిన్న, ప్రవీణ్ కుమార్, మహేష్, దేవరాజ్, ఓ.బి.సి సెల్ కన్వీనర్ హరికృష్ణ, సుధాకర్, రాజేందర్, శ్రీను, బుజెండర్, సంపత్ యాదవ్, కంది పెంటయ్య, పాండు, సాదిక్, హనీఫ్, అంజయ్య, నందు, వాలి, యాదయ్య, గోపాల్ గౌడ్, రషీద్, సాయికిషోర్, గౌస్, కళ్యాణ్, హనీఫ్ పాల్గొన్నారు..