- బాధిత కుటుంబానికి సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ అందజేత
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ కి చెందిన చందన రేఖ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నది. సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 2లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందచేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కరావు, విమల, పర్వీన్ పాల్గొన్నారు.