నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ వాసి జి.శ్రీనివాస్ రెడ్డి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి నుంచి రూ. 1లక్ష 25 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి మంజూరి పత్రాలను కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు అందించారు.