గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పట్ల సీఎం కేసీఆర్ కు బంజారాహిల్స్ గిరిజన ఉద్యోగుల కృతజ్ఞతలు

నమస్తే శేరిలింగంపల్లి: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సీఎం కేసీఆర్ కు బంజారహిల్స్ గిరిజన ఉద్యోగులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంజారా భవన్ లో బంజారా హిల్స్ గిరిజన ఉద్యోగులు పత్రికా సమావేశం నిర్వహించారు. బంజారా ప్రముఖులు డిటి నాయక్ , మాజీ పార్లమెంట్ సభ్యులు ఆచార్య సీతారాం నాయక్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర పాండు రంగ నాయక్, చీఫ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి మోహన్ నాయక్, జి హెచ్ ఎం సి, మాజీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీర్ల సంఘం. ఆర్. మోహన్ సింగ్, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ శంకర్ నాయక్, సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వి సైదా నాయక్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చైర్మన్ రమణ నాయక్, గిరిజన మేధావుల సంఘం అధ్యక్షులు ధనుంజయ నాయక్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు రామదాసు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ నాయక్, తీగ అధ్యక్షులు రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని జీఓ నెంబర్ 33 విడుదల చేసినందుకు, ఆదివాసి, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినందుకు,  తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ కు తెలంగాణ గిరిజన ఆదివాసి ఉద్యోగుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

పత్రికా సమావేశంలో డి టి నాయక్ , ఆచార్య సీతారాం నాయక్ , మోహన్ సింగ్ తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here