చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 14వ తేదీన జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సాయిబాబా కోరారు. ఆదివారం చందానగర్‌లోని పిజెఆర్ స్టేడియం వద్ద వాకర్లను స్థానిక సిపిఎం నాయకులతో కలిసిన ఆయన నాగేశ్వరరావుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోఫసర్ కె.నాగేశ్వర్ టీం సభ్యులు, శేరిలింగంపల్లి సిపిఎం కార్యదర్శి శోభన్, మల్లికార్జున్, జగదీశ్, కృష్ణ, శ్రీకాంత్, సురేష్, శశికాంత్, మధుసూదన్, శంకర్, ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.






