నమస్తే శేరిలింగంపల్లి: తారానగర్ ప్రాంతానికి చెందిన చిన్నారి తన్నీరు రుత్విక కూచుపూడి నృత్యంలో రాణిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇటీవల నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సేవ సాంస్కృతిక అకాడమి నిర్వహించిన నేషనల్ లెవెల్ డాన్స్ ఫెస్టివల్ లో రుత్విక పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలోనే ఆమె నాట్య కిన్నెర అవార్డును కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ మంగళవారం రుత్వికను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీ మాట్లాడుతు చిపూడి నృత్యంలో మరెంతగానో రాణించాలని సూచించారు. చిన్నారిని ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులు తన్నీరు సింహాద్రి దంపతులను, నాట్య గురువు డాక్టర్ పి.శ్రీనివాస్ వరప్రసాద్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. లలిత కళల్లో అద్భుత ప్రతిభ కనబరిచే చిన్నారులకు ప్రభుత్వపరంగా, తన వ్యక్తిగతంగా సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపారు.