చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన కంకల్ గ్రామ ప్రజలు

  • ఆర్థిక సహాయం అందజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్ కంకల్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించనున్నారు.

కంకల్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు ఆర్థిక సాయం అందిస్తున్న భేరి రాంచందర్ యాదవ్

ఈ మహోత్సవానికి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ని ఆహ్వానించేందుక ఆయనను మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భేరి రాంచందర్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల దామోదర్ యాదవ్, భేరీ కృష్ణ యాదవ్, రవీంద్ర కంకల్, అశోక్, శ్రీనివాస్, ఆంజనేయులు, రాము, వంశీ, వెంకట్, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here