యానిమల్ కేర్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ

  • వీధి కుక్కల కేరింగ్ పట్ల సిబ్బందికి అభినందన

నమస్తే శేరిలింగంపల్లి : ఎల్లమ్మ బండలోని యానిమల్ కేర్ సెంటర్ ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ సందర్శించారు. వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రక్రియ గురించి, యానిమల్ కేర్ సెంటర్ విది విధానాల గురించి సిబ్బందితో చర్చించారు.

ఎల్లమ్మ బండలోని యానిమల్ కేర్ సెంటర్ ను సందర్శించేందుకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి వెళ్తున్న ఎమ్మెల్యే గాంధీ

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యానిమల్ కేర్ సెంటర్ లో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటిని వేర్వేరు కెనాల్స్ లో పెట్టి నాలుగైదు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి వదిలిపెడుతున్నారని అన్నారు. యానిమాల్ కేర్ సెంటర్ ను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు.

యానిమల్ కేర్ సెంటర్ లో వీధి కుక్కలకు చేపడుతున్న సేవలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గాంధీ

ఇటీవల వీధి కుక్కల వల్ల జరిగిన దురదృష్టకర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాశీనాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, యానిమల్ కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here