చందానగర్ జాతీయ రహదారిపై పాదచారుల సిగ్నల్ ఏర్పాటు చేయండి

ట్రాఫిక్ డిసిపి కి కార్పొరేటర్ నవతరెడ్డి వినతి

ట్రాఫిక్ డిసిపికి వినతిపత్రం సమర్పిస్తున్న నవతరెడ్డి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీసు స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై పాదచారుల సిగ్నల్ ఏర్పాటు చేయాలని డివిజన్ కార్పొరేటర్ నవతరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ విభాగం డిసిపి విజయ్ కుమార్ ను కలిసిన ఆమె వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నవతరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా తాత్కాలికంగా పాదచారుల సిగ్నల్ ఏర్పాటు చేయాలన్నారు. అను ఫర్నిచర్ మరియు చందానగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థులు రోడ్డు దాటుతుంటారని విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సమస్యపై స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here