- సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో రూ. 42 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి KTR సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మరింత ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని పేర్కొన్నారు. జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి సీసీ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శ్రీకాంతిని, DE స్రవంతి , AE ప్రతాప్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రకాష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, రాజేశ్వర్ రావు, ఆంజనేయులు, పరమేష్, బాలరాజు పాల్గొన్నారు.