అట్టహాసంగా కేనరి ద స్కూల్ విద్యార్థి మండలి ప్రమాణ స్వీకారోత్సవం

  • తమకిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తామని విద్యార్థుల ప్రతిజ్ఞ

నమస్తే శేరిలింగంపల్లి: శ్రద్ద, పట్టుదల, నిరంతర కృషి , ఏకాగ్రత విజయానికి ముఖ్యమైన సూత్రాలని వింగ్ కమాండర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ స్ట్రాటజీ & బిజినెస్ డెవలప్ మెంట్ ఇన్ మెస్సేర్స్ అవెంటెల్ లిమిటెడ్, పిఆర్ ఎల్ ప్రకాష్ అన్నారు. మదీనాగూడలోని కేనరి ద స్కూల్లో 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థి మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది.

తోటి విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించగలమన్న నమ్మకం, విశ్వాసం వారి ముఖాల్లో ప్రకాశించాయి. అర్హత కలిగిన ప్రతీ విద్యార్థి వారికి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి మండలి సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ఎస్. లిడియా క్రిస్టినా పాఠశాల చైర్మన్ శ్వేత రెడ్డి చప్పిడి, బ్యాడ్జ్ , శాసేలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఉన్నత పాఠశాలకు 10వ తరగతికి చెందిన సృజన హెడ్ గర్ల్, 9వ తరగతి విద్యార్థి మయాంక్ హెడ్ బాయ్, ప్రాథమిక పాఠశాలకు శ్లేషన్, యశ్వి పాండే ఇతర మండలి సభ్యులు వారి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పిఆర్ ఎల్ ప్రకాష్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. తరువాత మండలి సభ్యులు వారికి సహాయ సహకారాలు అందచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కో-ఆర్డినేటర్లు, అడ్మిన్ మేనేజర్ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here