- మదీనాగూడ, మక్త మహబూబ్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణి
నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా.. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవడమే తమ ట్రస్ట్ ఉద్దేశమని సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్ అన్నారు. మదీనాగూడ, మక్త మహబూబ్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాఘవేంద్రరావు, వినోద్ రావు, యాదగిరి ముదిరాజ్, శ్రీధర్ గౌడ్, మహేష్ యాదవ్, సత్యనారాయణ, యూసుఫ్, రవి గౌడ్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, అశోక్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, మల్లేష్, రమేష్ శ్రీనివాస్, శివరాజ్, రవి ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్, రాము, శివరాజ్, బాబు, ముఖేష్, శివారెడ్డి, కృష్ణ, వరప్రసాద్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.