ఇక ఇండ్ల నిర్మాణమే తరువాయి… శేరిలింగంపల్లి జర్నలిస్టుల కళ్లల్లో ఆనందం…

  • చందానగర్ సర్వే నెం. 174 లోని ఎకరా స్థలంలో భూమిపూజ
  • అనంతరం జర్నలిస్ట్ నాయకులతో కలిసి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ గాంధీ 
  • ఎమ్మెల్యే గాంధీ, మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణకు జర్నలిస్టు నాయకుల కృతజ్ఞతలు
  • ప్రెస్ క్లబ్ నిర్మాణంపై విజ్ఞప్తి.. సానుకూల స్పందన…

నమస్తే శేరిలింగంపల్లి : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని ప్రభుత్వ విప్ ఆరె కపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చందానగర్ లోని సర్వే నెంబర్ 174లో 1 ఎకరం స్థలాన్ని కేటాయించగా, ఆదివారం ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా హాజరై సదరు స్థలంలో జర్నలిస్టు నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చందానగర్ కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డి, టియూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ తో కలిసి మొక్కలు నాటారు.

భూమిపూజలో భాగంగా కొబ్బరి కాయ కొడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పాల్గొన్న శేరిలింగంపల్లి జర్నలిస్టులు ఎంతో కాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. టియూడబ్ల్యుజే నాయకులు తమ ఇళ్ల స్థలాల సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలం మంజూరు కోసం అధికారులతో చర్చించానని, ఇందులో ఏర్పడిన సమస్యలను గుర్తించి, సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలుమార్లు కలిషామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులను సమన్వయం చేసుకుంటూ శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం చందానగర్ లో ఒక ఎకరం స్థలాన్ని మంజూరు చేశామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం పూర్తి సహకారం అందజేస్తానని అన్నారు. ఇప్పటికే టియూడబ్ల్యుజే నాయకులు ప్రెస్ క్లబ్ నిర్మాణ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే ప్రెస్ క్లబ్ నిర్మాణం మీద నిర్ణయం వెలువడుతుందని హామీ ఇచ్చారు. టియూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని, జర్నలిస్టుల కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 90 నియోజకవర్గాల పరిధిలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిందని తెలిపారు. శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలం కోసం సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలం కోసం బాధ్యత తీసుకొని, స్థలం మంజూరు చేయించిన ఎమ్మెల్యే గాంధీని ఎన్నటికీ మరువలేమన్నారు.

ఇండ్ల నిర్మాణ ప్రాంగణంలో శేరిలింగంపల్లి జర్నలిస్టులతో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినా, శేరిలింగంపల్లిలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో ఇళ్ల స్థలాల మంజూరు జరుగలేదని, కానీ నేడు స్థానిక జర్నలిస్టుల మూడు దశాబ్దాల కల సాకారం అయ్యిందన్నారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేశ్ సాగర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయింపుకు సహకరించిన ఎమ్మెల్యే గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ, మొత్తం జర్నలిస్టులకు కేటాయింపు కోసం పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని మంజూరు చేయించే విధంగా ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని మంజూరు చేయించి స్వంత నిధులతో నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం సంతోషదాయకం అన్నారు. జర్నలిస్టు నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టులతో కలసి జామ మొక్క నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే జిల్లా ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, యూనియన్ నాయకులు కె.నాగమల్లేశ్వర్ రావు. అమృత్ గౌడ్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీనారాయణ, టెంజు అధ్యక్షుడు పి. సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమార్, రవీందర్ రెడ్డి, సలీమ్, మాధవ్ రెడ్ది, తిరుపతిరెడ్డి, వినయ్ కుమార్ గౌడ్ లతో పాటు శేరిలింగంపల్లి పరిధిలోని జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here