పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు

  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 100 మంది పలువురు నాయకులు , కార్యకర్తలు శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీ లో చేరారు. వారికి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు. నెహ్రు నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, చింతకింది రవీందర్ గౌడ్, కృష్ణ యాదవ్, రమేష్ , మహేష్ ముదిరాజు, కుమారి,దివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ల నుండి బీఆర్ ఎస్ పార్టీ లోకి చేరిన ముఖ్య నాయకులు చిరంజీవి రెడ్డి, సూరజ్, మౌనిక్, సుజిత్,వరుణ్,అఖిల్, సంతోష్, నరేందర్, మహేందర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ పార్టీ లోకి చేరడం జరిగినది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here