- మాదాపూర్ డివిజన్ ఆదిత్యనగర్, హఫీజ్ పేట్ డివిజన్ గంగారాం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకుల చేరిక
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, మంచి పనులు ఎన్నో చేశాం నిండు మనసుతో ఆశీర్వదించాలని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీ శ్రీ రామ రక్ష అని , యువత బీఆర్ఎస్ వైపే ఉందని, యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలిపారు.
అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, బాబు మియా, లియాకత్, ఖాసీం, అబ్దుల్ రహామాన్, బాబు బాయ్, మియన్ పటేల్ బాబు బాయ్, బృందరావు, ఖలీమ్, కాజా, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు ఆఫన్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- హఫీజ్ పేట్ నుంచి…
హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అక్తర్, ఉరిటీ వెంకట్ రావు, మోహన్ ముదిరాజు, ప్రవీణ్, దాత్రి గౌడ్,రామరాజు , భగవత్ కార్యకర్తలు, బీ అర్ స్ పార్టీ అభిమానులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.
పార్టీ లో చేరిన వారిలో దొంతి శ్రవణ్ కుమార్, నగేష్, సాయి, నరేష్, వెంకట్, బాబీ, విష్ణు, నరేష్, నర్సిములు, సన్నీ, సాయి, అలీ శ్యామ్, జ్ఞాని, సుకుమార్, కిరణ్, నిఖిల్, శ్రీకాంత్, మహేష్ ఉన్నారు.