సంక్షేమ పథకాలకు ఆకర్షితులై .. పార్టీలో చేరాం

  • బిఆర్ ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు బిఆర్ ఎస్ లో చేరారు. ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని చెప్పారు. కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ వారి కార్యాలయంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ సమక్షంలో, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరసింహ సాగర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మహిళా కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి, దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దటం తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ అహర్నిశలు శ్రమించి, మౌలిక వసతుల కల్పనలో కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోడల నరసింహ సాగర్, పీ రామకృష్ణ, స్వామి సాగర్, చందర్, మంజుల, పద్మ, నస్రీన్ బేగం, కవిత, సరస్వతి, స్పందన, అస్మాన్ బేగం, రజిత, లింగమ్మ, సంగీత, వెంకటేష్, స్టాలిన్, యాదగిరి ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here