చందాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి స‌న్మానం

చందాన‌గ‌ర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నూత‌నంగా చందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మంజుల ర‌ఘునాథ్‌రెడ్డిని మాధ‌వ్ బృందావ‌న్ అపార్ట్‌‌మెంట్ అసోసియేష‌న్ స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు. శుక్ర‌వారం కార్పొరేట‌ర్ నివాసంలో ఆమెను క‌లిసిన అసోసియేష‌న్ స‌భ్యులు,ఆమెతో పాటు చందాన‌గ‌ర్ డివిజ‌న్ టిఆర్ఎస్ అధ్య‌క్షులు రఘునాథ్ రెడ్డిల‌ను శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకురాగా ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అసోసియేష‌న్ స‌భ్యులు పి.రామ‌క్రిష్ణ‌, పి.ర‌వికుమార్‌, మిహిర బాల‌, నాగ శ్రీ‌వ‌ల్లి, రామ్ చంద్రారెడ్డి, వెంక‌ట చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి దంప‌తుల‌ను స‌న్మానిస్తున్న బృందావ‌న్ అపార్ట్‌మెంట్ అసోసియేష‌న్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here