నమస్తే శేరిలింగంపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, హోప్ ఫౌండేషన్ సభ్యుడు నూకల సందీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. చందానగర్ నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఓ నిరుపేద కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు 100 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ చైర్మెన్, హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండ విజయ్‌కుమార్, సభ్యులు గాలి కృష్ణ, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.