బిజెపిని గెలిపిద్దాం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర 63వ రోజుకు చేరింది. మాదాపూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, రవి ఎంక్లేవ్ , కొండాపూర్ వీకర్ సెక్షన్ కాలనీ, శిల్పా పార్క్, బిక్షపతి నగర్ లలో ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ, బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పర్యటించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్.

అనంతరం మాట్లాడుతూ హనుమాన్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదనివాపోతున్నారన్నారు. జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి ఆమడదూరంలో బిక్షపతి నగర్ ఉందని, గతంలో బిక్షపతి యాదవ్ వేసిన రోడ్లు , డ్రైనేజీ లైన్లు, మంజీరా లైన్లు తప్ప వీళ్ళు ఒక్క సమస్యను కూడా పట్టించుకోవట్లేదన్నారు.

ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, మధు యాదవ్, ప్రసాద్, యాదయ్య, శ్రీధర్ , కిరణ్, శ్రీకాంత్, కృష్ణ గౌడ్, కుర్మయ్య, బాలు నాయక్, భారతి, ఆనంద్, శివా , నరేష్, గోపాల్ , నరేష్ , పద్మ , పార్వతి, నాగులు, వెంకటేష్ , సాయి, నాగరాజు, శ్రీనివాస్, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here