- నిర్మాణం పూర్తయినా నిరూపయోగంగా డబుల్ ఇండ్లు
- రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కు శేరిలింగంపల్లి ప్రజా సంఘాల ఐక్య వేదిక వినతి
నమస్తే శేరిలింగంపల్లి: డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తైనా నిరూపయోగంగా ఉన్నాయని, వాటిని దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు అందజేయాలని కోరుతూ..రెవిన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ కి శేరిలింగంపల్లి ప్రజా సంఘాల ఐక్య వేదిక వినతి పత్రం సమర్పించింది. శేరిలింగంపల్లి మండలంలోని గుల్ మోహర్ పార్క్ కాలనీలో ఇప్పటికే డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, నిరూపయోగంగా ఉన్నాయని తెలిపారు. అక్కడి పేదలు కిరాయి ఇండ్లల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఇండ్లను వారికి కేటాయించాలని అన్నారు. అంతేకాక స్థానికంగా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా పాలవుతున్నదని, సదరు స్థలాన్ని కాపాడాలని కోరారు. ఆ స్థలంలో ఇల్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని విన్నవించారు.