- అప్లికేషన్లు లక్షల్లో వస్తే.. కట్టింది అరకొరే
- అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబల్ బెడ్ ఇండ్లు పంపిణీ చేయాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలివెళ్ళారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో అన్ని ఇచ్చినం, చేసినం అని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తురన్నారు.
2014 , 2018 ఎన్నికలలో పేద వాళ్లకు కొడుకు వస్తే ఎక్కడ ఉండాలి, అల్లుడు వస్తే ఎడ పండాలి అని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తా అని ఆశ చూపి ఓట్లు వేయించుకున్నారు, అప్లికేషన్లు లక్షల్లో వస్తే కట్టింది అరకొరే, అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, మధు యాదవ్, లక్ష్మణ్, సీత రామరాజు, గణేష్, భరత్, అజిత్, రమేష్, చెన్నయ్య, కృష్ణ , గోవర్ధన్ రెడ్డి, మన్యం కొండా సాగర్, చంద్ర మౌళి, శ్రీనివాస్ యాదవ్, అశోక్, రవి , మఖన్ సింగ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, జగదీష్, అంభు, నరేష్, వంశీ, కార్యకర్తలు పాల్గొన్నారు.