ప్రాణం తీసిన అతివేగం, అజాగ్రత్త

నమస్తే శేరిలింగంపల్లి : అతివేగం, అజాగ్రత్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన హాఫిజ్ పేట్ ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకున్నది. 5వ తేదీన సాయంత్రం ప్రేమ్ నగర్ నివాసి సమీర్ దాస్ (42) తన మోటార్ సైకిల్ (TS09 EH 7950 )పై మియాపూర్ నుండి ప్రేమ్ నగర్ వెళ్తున్నాడు. హెల్మెట్ పెట్టుకోకుండా, అజాగ్రత్త వాహనాన్ని నడిపించడంతో మార్గమధ్యంలో హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ పై మోటార్ సైకిల్ కింద పడటంతో తలకు, మోకానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుచూ 6న ఉదయం 4:43 నిమిషాలకు మరణించాడు.

మృతుడు సమీర్ దాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here