శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్, ఆర్‌బీఆర్ అపార్ట్‌మెంట్‌తోపాటు మక్తా మహబూబ్‌పేట్ డివిజన్‌లోని జనప్రియ వెస్ట్ సిటీ, బీకే ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నాయకులతో కలిసి SIR కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మీ ఓటు–మీ హక్కు, మీ భాగస్వామ్యం–బలమైన ప్రజాస్వామ్యానికి బాట అని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు చురుకుగా పాల్గొని తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన్నేపల్లి సాంబశివరావు, యలమంచి ఉదయ్ కిరణ్, నడిమిటి కృష్ణ, భాస్కర్ గౌడ్, రవికుమార్ గౌడ్, శంకర్, కృష్ణ గౌడ్, వాసు, బీకే ఎన్‌క్లేవ్ అధ్యక్షుడు రావిపాటి వెంకటేశ్వరరావు, జనప్రియ వెస్ట్ సిటీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, రాంబాబు, నవీన్, సురేష్, రామకృష్ణ, శ్రీశైలం, శ్రీకాంత్, లక్ష్మణ్, ప్రభాకర్ గౌడ్, కవిత, దశప్ప, శ్రీను, వెంకటేష్, సదానంద్, పద్మ, జనార్దన్ రెడ్డి, ధనుంజయులు, వాహిని, గోవర్ధన్, ఐన రెడ్డి, కేశవులు, పరమేష్, రాజేందర్, శరత్, వంశీ, మధు, అంజి, గోపి, శశి, రత్నాచారి, నాగసాయి, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





