- ఎం.సి.పి.ఐ.యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపు
- గోడ పత్రికలవిడుదల
నమస్తే శేరిలింగంపల్లి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి శత జయంతి వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఎం.సి.పి.ఐ.యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంసీపీఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికలు విడుదల చేశారు. 9న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి శతజయంతి వార్షికోత్సవ గోడపత్రికలను గ్రేటర్ హైదరాబాద్ నాయకులు విడుదల చేశారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ నడిగడ్డ తండాలో అడుగు పెట్టిన బీమిరెడ్డి నర్సింహా రెడ్డి తండా ప్రజలతో ఉద్యమ అనుబంధం ఉన్నది. భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచం గర్వించదగ్గ జరిగిన పోరాటం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. కామ్రేడ్ బి.ఎన్ స్ఫూర్తిని కొనసాగించుతూ ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బి.ఎన్ శతజయంతి వార్షికోత్సవాన్ని 2022 మార్చి15 నుండి 2023 మార్చి15 వరకు తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే 2023 జనవరి 9న హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం10 గంటల సాయంత్రం 6.00వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి- రాజకీయ సామాజిక అంశాలపై బి.ఎన్ ప్రభావం అనే అంశంతో బి.ఎన్ శతజయంతి వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వామపక్ష, సామాజిక పార్టీల నాయకులతో పాటు మేధావులు, రచయితలు కవులు, కళాకారులు, బి.ఎన్ సహచరులు ఆయన కుటుంబసభ్యులు పాల్గొని ప్రసంగిస్తారని, ఈ సభను విజయవంతం చేయాలని అన్నారు.
కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ కార్యదర్శి వర్గ సభ్యులు కర్ర దానయ్య అంగడి పుష్ప, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, కమిటీ సభ్యులు పి. భాగ్యమ్మ దేవనూర్ లక్ష్మి, డివిజన్ నాయకులు దేవనూర్ నర్సింహ పాల్గొన్నారు.