నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కపిల్ మిశ్రాతో ఈ నెల 13వ తేదీన శేరిలింగంపల్లిలో నిర్వహించనున్న భాగ్యనగర్ మే చర్చ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తారానగర్‌లోని తుల్జాభవానీ ఆలయం వద్ద ఉదయం 11:30 గం.లకు ప్రారంభమయ్యే ఈ చర్చా కార్యక్రమంలో రాష్ర్ట, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజక వర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.