మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి):మియాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ ను విశ్వకర్మ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఉప్పలపాటి శ్రీకాంత్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ తనను గెలిపించిన మియాపూర్ డివిజన్ ప్రజలకు ఋణపడి ఉంటానని, వారి సమస్యలను తీర్చి డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగురాష్ట్రాల విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీంద్రచారీ గారు, శేరిలింగంపల్లి విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షుడు శంకరచారీ గారు, వైస్ ప్రెసిడెంట్ రామచారీ గారు, సభ్యులు లక్ష్మచారీ, కుషాచారీ, శ్రీనివాసచారీ తదితరులు పాల్గొన్నారు.
