కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం

  • కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలంలోని నెర్మట గ్రామంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ఈ విజయాన్ని సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, అక్బర్ ఖాన్, అంజద్, గ్రామస్థులు పాల్గొన్నారు.

చండూరు మండలంలోని నెర్మట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ప్రజలతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here