- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఎమ్మెల్యే అరికాపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లిన శ్రీరామ్ నగర్ కాలనీ బీ బ్లాక్ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ని శ్రీరామ్ నగర్ కాలనీ బీ బ్లాక్ లో యూజుడీ అవుట్ లెట్ లేకపోవటంతో వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్డుపై వర్షం నీరు నిలుస్తుండటంతో కాలనీవాసులు ఇబ్భందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక కాలని వాసులు ఈ విషయాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఎమ్మెల్యే అరికాపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి వర్షం నీరు నిల్వకుండా, యుజిడి లైన్ అవుట్లైట్ పనులను వెంటనే పూర్తి చేయిస్తానన్నారు. చిన్నపాటి వర్షానికి లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీటితోపాటు యుజిడి లైన్ పొంగిపొర్లడం వల్ల ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఎమ్మెల్యేకి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. జిల్లా పరిషత్ స్కూల్ పక్కన మురికి నీటి కాలువలో చెత్త చెదారంతో వ్యర్ధాలు నిండిపోవడంతో వర్షానికి వచ్చిన వరద నీరు సాఫీగా వెళ్లట్లేదని, నల్లగండ్ల కూరగాయల మార్కెట్ వరకు నాలా పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయినదని జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి కాలువలో పేరుకుపోయిన వ్యర్ధాలను వెంటనే తొలగించి వర్షం నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, జగన్మోహన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, క్రాంతి కిరణ్, గోపాల్ యాదవ్, జమ్మయ్య, శ్రీరాం నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.