- నిత్యం సినిమా షూటింగ్ లకు నిలయం అల్యూమినియం (ఆలిండ్) ఫ్యాక్టరీ
- సెట్ల వెనుక ఉన్న వ్యర్థాలకు అంటుకున్న మంటలు
- పెద్ద ఎత్తున కమ్ముకున్న పొగలు.. ఆపేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బంది
- ప్రస్తుతం కొనసాగుతున్న స్టార్ హీరో మూవీ షూటింగ్
నమస్తే శేరిలింగంపల్లి : సినిమా షూటింగ్ లకు నిలయమైన శేరిలింగంపల్లిలోని అల్యూమినియం (ఆలిండ్) ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి గురైంది. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజిగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షూటింగ్ ల కోసం వేసిన సెట్ల వెనుక ఈ సంఘటన జరిగింది.
తరచూ షూటింగ్ ల కోసం సెట్లు వేసి ముగిసాక ఆ సామాగ్రిని (వ్యర్థాలను) సెట్ల వెనకాల డంపింగ్ చేస్తుంటారు. అయితే శనివారం సాయంత్రం డంపింగ్ యార్డ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు రెండు గంటలకు పైగా మంటలు ఎగసిపడుతూనే ఉండడంతో చుట్టూ పక్కల దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాద స్థలికి పక్కనే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఉండడంతో అటు వైపు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కూడా అక్కడ ఓ స్టార్ హీరో సినిమా షూటింగ్ కొనసాగుతుంది.