అభిన‌వ తార‌క రాముడు, యువ‌త‌కు ఆద‌ర్శ‌ప్రాయుడు కేటీఆర్‌: గుర్ల‌ తిరుమలేష్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ యువ నాయ‌కుడు గుర్ల తిరుమ‌లేష్ జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి చీర‌ల‌ను, మాస్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌లేష్ మాట్లాడుతూ అభిన‌వ తార‌క‌రాముడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, యూత్ ఐకాన్ కేటీఆర్ జ‌న్మ‌దిన వేళ తోచిన సేవ చేయ‌డం ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని అన్నారు. కేటీఆర్ ఆలోచ‌న‌ల‌తో హైద‌రాబాద్ ప్ర‌పంచ న‌గ‌రంగా అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు. యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్న కేటీఆర్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువ నాయకులు గణేష్ రెడ్డి, ప్రశాంత్, కంది ఘనేశ్వర్, మదుకుమార్, వెంకటేష్, పహిల్వాన్ హరీష్ త‌దితరులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికుల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న గుర్ల తిరుమ‌లేష్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here