ప్ర‌శాంత్ న‌గ‌ర్ సాయి మందిరంలో వైభ‌వంగా గురుపూర్ణిమ‌… బాబా ద‌య‌తో క‌రోనాకు విముక్తి: ఒంగూరు శ్రీనివాస్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్ ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లోని సాయిబాబా మందిరంలో శ‌నివారం గురుపౌర్ణమి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త ఒంగూరు శ్రీనివాస్ యాద‌వ్ కుటుం స‌భ్యులు సాయిబాబాకు ప్ర‌త్యేక పూజ‌లు ఆచ‌రించారు. అదేవిధంగా బాబాకు అన్న‌స‌మారాధ‌న నిర్వహించారు. కాగా ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి సాయిబాబాను ద‌ర్శించుకుని బాబా అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఒంగూరు శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ క‌రోనాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌ని, బాబా ద‌య‌తో ఇప్ప‌టికైనా ఆ ప్ర‌పంచ మ‌హ్మ‌మ్మారి నుంచి పూర్తిగి విముక్తి ల‌భిస్తుంద‌ని ఆశాబావం వ్య‌క్తం చేశారు.

భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తున్న సాయిబాబా
అన్న‌ప్ర‌సాదాన్ని వ‌డ్డిస్తున్న ఆల‌య ధ‌ర్మ‌కర్త ఒంగూరు శ్రీనివాస్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here