కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి కాల‌నీవాసుల స‌న్మానం

చందాన‌గ‌ర్‌‌ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సి, శుభోదయ కాలనీ తిలక్, న్యూ శంకర్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డిలు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా క‌లిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన కాలనీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చిత్ర పటాన్ని ఆమెకు శుభోదయ కాలనీ వాసులు బహుకరించారు.

కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి ఆమె చిత్ర ప‌టాన్ని అంద‌జేసిన శుభోదయ కాలనీ వాసులు
కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన కాల‌నీల వాసులు
కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన కాల‌నీల వాసులు

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవి కుమార్, వెంకటేశ్వర్లు, డానియల్, మంజునాథ్, శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రాజా, నాగేందర్, మధు, నాంచారయ్య, శుభోదయ కాలనీ వెంకట్ రెడ్డి, శేఖర్, రాజు, ఎస్ కె దాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here