చిత్ర‌క‌ళ‌తో చిన్నారుల్లో సృజ‌నాత్మ‌క‌త : ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి ‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చిత్ర‌క‌ళ‌ను అభ్య‌సించ‌డం ద్వారా చిన్నారుల్లో సృజ‌నాత్మ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. కోవిడ్ 19 నేప‌థ్యంలో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆన్‌లైన్‌లో చిత్ర‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ప్రకటించిన అవార్డును డైరెక్టర్ రమేష్ బైరు కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అంద‌జేశారు. అనంత‌రం గాంధీ మాట్లాడుతూ పికాసో సంస్థ చిత్ర‌క‌ళ‌లో చిన్నారుల‌ను తీర్చిదిద్దుతుండ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా పికాసో సంస్థ కార్య‌క‌లాపాల‌ను గాంధీ అభినందించారు.

పికాసో సంస్థ డైరెక్ట‌ర్ ర‌మేష్‌కు అవార్డును అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here