ముదిగొండ శివ‌ప్ర‌సాద్ స‌త్య‌మేవ జ‌య‌తే గ్రంథం భార‌తీయం స‌త్య‌వాణికి అంకితం

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌ముఖ చారిత్రక నవలా ర‌చ‌యిత డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్ తాను రాసిన స‌త్య‌మేవ జ‌య‌తే అనే రెండు భాగాల‌తో కూడిన 1000 పేజీల గ్రంథాన్ని భార‌తీయం స‌త్య‌వాణి దంప‌తుల‌కు అంకిత‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా శివ‌ప్ర‌సాద్ శుక్ర‌వారం త‌న భార్య‌, ర‌చయిత్రి ఉమాదేవి వ‌ర్ధంతి సంద‌ర్భంగా త‌న కుమార్తె సుష్మ‌తో క‌లిసి స‌త్య‌వాణి నివాసానికి వెళ్లి ఆమెకు గ్రంథాన్ని అంద‌జేశారు. అనంత‌రం ఆమెను శివ ప్ర‌సాద్ స‌న్మానించారు.

భార‌తీయం స‌త్య‌వాణి దంప‌తుల‌కు పుస్త‌కాన్ని అంద‌జేసి వారిని స‌న్మానించిన డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్

ఈ సంద‌ర్బంగా శివ ప్ర‌సాద్ మాట్లాడుతూ పుస్త‌కాన్ని స‌భా ముఖంగా పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ఆవిష్క‌రిద్దామ‌నుకున్నాన‌ని, కానీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆ ప‌నిచేయ‌లేక‌పోతున్నందుకు విచారంగా ఉంద‌న్నారు. స‌త్య‌మేవ జ‌య‌తే గ్రంథంలో వేదాలలోని మూలాలను, ఇంకా అనేకానేక విషయాలను పరిశోధించి అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఆర్ష సంస్కృతి కోసం పాటుపడుతున్న భారతీయం సత్య వాణికి ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా శివ ప్ర‌సాద్‌ను స‌త్య‌వాణి స‌న్మానించారు. ఈ తరం వారికి తెలియని ఎన్నో అనేక విషయాలను ఈ గ్రంథంలో ప్రస్తావించడం జరిగిందని, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం కూడా ఈ గ్రంథంలో దొరుకుతుందని ఆమె వెల్లడించారు. ఇది అందరూ చదవదగిన గ్రంథమ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here