గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో కృష్ణ సాగర్, కే గణేష్ లు నూతనంగా ఏర్పాటు చేసిన వామ్ అండ్ స్పైస్ మల్టీ కుషన్ రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు స్వయం ఉపాధి మార్గాల ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగులకు అందించే పథకాలను వారు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. యువత ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రాణిస్తుందని, అందుకు గాను ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రభుత్వం అందించే సహాయంతో యువకులు సొంత కాళ్లపై నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్ పాల్గొన్నారు.







