- శివానుగ్రహంతోనే మానవ మనుగడ: బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామచంద్రమూర్తి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీ అభయాంజనేయ సహిత సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి కార్తీక మాసంను పురస్కరించుకుని గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాధారణ, మండప అర్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, జ్యోతిర్లింగార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివ రామచంద్రమూర్తి పర్యవేక్షణలో పార్వతీపరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.

ఈ సందర్భంగా శివ రామంచంద్ర మూర్తి భక్తులనుద్దేశించి మాట్లాడూతూ భూ మండలంలో సమస్త జీవనం సృష్టి స్థితి లయకారుడైన శివానుగ్రహంతోనే నడుస్తోందని, ధర్మం రక్షింపబడి సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జగత్తును కరోనా మహమ్మారి కాకావికలం చేస్తున్న దృష్ట్యా కరోనాను రూపుమాపి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆ పరమేశ్వరున్ని వేడుకుంటూ లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణోత్సవంలో హుడా ట్రేడా సెంటర్ కాలనీ అధ్యక్షుడు కుకునూరి శ్రీనివాస్ గౌడ్, సాయినాథ్ పాఠశాల చైర్మన్ పవన్, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.






