శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నవంబర్ 1న తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో మియాపూర్ చౌరస్తా సమీపంలోని ఆర్‌బీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మసీదు దగ్గర ఓ వ్యక్తి మృతదేహాన్ని జీహెచ్‌ఎంసీ స్వీపర్ గుర్తించారు. మియాపూర్ సర్కిల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఉబిది భవాని (27) రోడ్డు శుభ్రం చేస్తున్న సమయంలో సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి నేలపై పడి ఉండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు.

వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా, అతడి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే మియాపూర్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మియాపూర్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ 8712663170, మియాపూర్ పోలీస్ స్టేషన్ 8712663179, కే. సంగయ్య, ఏఎస్ఐ (దర్యాప్తు అధికారి) 8712567170 నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు.





