శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్‌వీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, మియాపూర్ డివిజన్ నాయకుడు రాజు వడ్డెరాజు ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రైవేట్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఫ్యాకల్టీ సిబ్బందిని నేరుగా కలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

ప్రతి అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని రాజు వడ్డెరాజు విజ్ఞప్తి చేశారు. విద్యావంతుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలల సిబ్బందికి ఓటరు నమోదు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీ ఓటు మీ హక్కు – మీ ఓటు మీ భవిష్యత్తు అనే నినాదంతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.





