తెలంగాణ రాష్ట్ర సభ్యుడిగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్‌లో బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి నియామకం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): న్యూఢిల్లీ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ (NWC) తెలంగాణ రాష్ట్ర సభ్యుడిగా బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కౌన్సిల్ నుంచి అధికారిక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫైల్ నంబర్ 1596851/11001/NWC/2026 ప్రకారం ఆయన నియామకం అక్టోబర్ 30 నుంచి 2029 అక్టోబర్ 29 వరకు మూడేళ్ల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ బాధ్యతను అప్పగించిన కౌన్సిల్ సెంట్రల్ చైర్మన్ రాహుల్ ద్వివేది, కాంపిటెంట్ అథారిటీ, సెంట్రల్ స్టాండింగ్ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీతో, అంకితభావంతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు తెలంగాణ ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రయాణంలో అందరి ఆశీస్సులు, ప్రోత్సాహం కొనసాగించాలని ఆయన కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here