శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కైలాసపురి 15వ ఫేజ్లో గత కొంతకాలంగా మూసివేసిన రోడ్డును తిరిగి తెరవాలని స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జిట్టా రమ్యకృష్ణ సునీల్ యాదవ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. చిత్తారమ్మ ఆలయం, రెయిన్బో వైన్స్ వెనుకవైపు ఉన్న రహదారిని మూసివేయడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల నుంచి సమస్యను తెలుసుకున్న ఆయన కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులును కలిసి రహదారి మూసివేతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

ఈ మేరకు రోడ్డును తిరిగి తెరవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే సంబంధిత సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి, రహదారి మూసివేతకు గల కారణాలను పరిశీలించి, రోడ్డును తిరిగి తెరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.





