గడ్డం రంజిత్ రెడ్డికి ఆరెకపూడి గాంధీ దసరా శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి గడ్డం రంజిత్ రెడ్డికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, గణేష్ ముదిరాజు, అక్తర్, మారబోయిన రాజు యాదవ్, నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, అక్బర్ ఖాన్, శివరాజు గౌడ్, సమ్మారెడ్డి నాగరాజు, దొడ్ల రామకృష్ణ గౌడ్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here