శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ మాత పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ హఫీజ్పేట్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనకమామిడి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. సరస్వతీ మాత, కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఓల్డ్ హఫీజ్పేట్ గ్రామ ప్రజలందరిపై, ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.






