అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఏం.ఏ. నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ పూలతో అందంగా బతుకమ్మలను పేర్చగా, వాటిలో ఉత్తమంగా నిలిచిన బతుకమ్మలకు మొదటి, రెండో, మూడో బహుమతులను అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు అట్టేపల్లి రామప్రభు బతుకమ్మ కానుకలను అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏం.ఏ. నగర్ కాలనీ పెద్దలు, కాలనీవాసులు, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు, యువత పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచులు ఐకమత్యంతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి వేడుకలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here