శేరిలింగంపల్లిలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన పలు దుర్గామాత మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దుర్గామాత అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పాపిరెడ్డి కాలనీలో స్థానికులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా శరన్నవరాత్రి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, రమేష్, శ్రీశైలం, నరసింహ, రాజుశెట్టి, భాస్కర్, సిద్ధేశ్, ఎల్లేష్, రాజు, ప్రవీణ్, శంకర్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here