పోయిందనుకున్న ఐఫోన్‌ను యజమానికి అప్పగించిన మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రోడ్డుపై దొరికిన విలువైన ఐఫోన్‌ను భద్రపరిచి, దాని యజమానిని గుర్తించి తిరిగి అప్పగించడం ద్వారా మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిజాయితీ చాటుకున్నారు. దీప్తిశ్రీనగర్‌కు చెందిన శీనయ్య తన పిల్లలను స్కూల్‌లో దింపేందుకు ఉదయం వెళ్తుండగా ఐఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఫోన్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఇక దొరకదని భావించాడు. అదే సమయంలో విధుల్లో ఉన్న మియాపూర్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అబేల్‌కు రోడ్డుపై ఐఫోన్ దొరికింది. ఫోన్‌లోని వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించి యజమాని శీనయ్యను గుర్తించే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ విషయాన్ని మియాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వివరాలను నిర్ధారించిన తర్వాత ఐఫోన్‌ను శీనయ్యకు అప్పగించారు.

పోయిందనుకున్న తన విలువైన ఫోన్‌ను పోలీసులు తిరిగి అందజేయడంతో శీనయ్య ఆనందం వ్యక్తం చేశారు. నిజాయితీగా వ్యవహరించి ఫోన్‌ను తనకు అప్పగించిన సీఐ నర్సింహారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ అబేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సేవాభావం, నిజాయితీపై స్థానికులు కూడా అభినందనలు వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here