నల్లగండ్ల NTR నగర్‌లో ఘనంగా గణనాథుడి ప్రత్యేక పూజలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని NTR నగర్‌లో బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగండ్ల BRS పార్టీ నాయకుడు హరిశంకర్ యాదవ్‌తో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, వెంకట్ రెడ్డి, నారాయణ, సురేష్‌తో పాటు స్థానిక BRS నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here